Featuredఅంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్క్రైమ్రాజకీయంవైరల్

మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ జగన్ ధర్నా

అధికారుల కోసం కార్యాలయం వద్ద నిరసన

మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ జగన్ ధర్నా

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆందోళన

ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపుతున్నారని ఆరోపణ

అధికారుల కోసం కార్యాలయం వద్ద నిరసన

పులివెందుల, మన జనప్రగతి

పులివెందుల మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా కూటమి నాయకులు బలవంతంగా పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారని, దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఈ విషయాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసేందుకు తొలుత పులివెందుల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దుశాంత్ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఫిర్యాదు స్వీకరించేందుకు సంబంధిత ఎన్నికల అధికారులు అందుబాటులో లేకపోవడంతో నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పటికీ ఎవరూ అందుబాటులో లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ కార్యాలయం బయట మహిళలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనతో పులివెందుల మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button