
మన జన ప్రగతి, కూకట్ పల్లి : దీక్ష జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన “డి-స్టార్ట్ (D-START)” పేరుతో స్కాలర్‌షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్లు రాజు మరియు ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష ఒక మంచి అవకాశమని వారు పేర్కొన్నారు.
ఈ పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 10వ తరగతి నుంచే స్కాలర్‌షిప్ అందించడంతో పాటు, ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల చదువుకు కూడా ఆర్థిక సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఇతర సంస్థలు అందించని విధంగా ముందుగానే స్కాలర్‌షిప్ అవకాశాన్ని అందించడం ప్రత్యేకతగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అందువల్ల 10వ తరగతి చదువుతున్న విధ్యార్థిని విధ్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, విరివిగా పాల్గొని మంచి ఫలితాలు సాధించి స్కాలర్‌షిప్ పొందాలని కోరారు. విధ్యార్థిని విధ్యార్థుల భవిష్యత్ విద్యాభివృద్ధికి ఈ పరీక్ష ఎంతో దోహదపడుతుందని వారు ఆకాంక్షించారు.



