
కడప మన జనప్రగతి ఫిబ్రవరి 26:-
మహిళల భద్రతను అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆదేశాలు, కడప డి.ఎస్.పి ఎ. వెంకటేశ్వర్లు సూచనల మేరకు గురువారం కడప నగరంలోని కోటిరెడ్డి మహిళా డిగ్రీ కాలేజ్ లో మహిళా రక్షణ, శక్తి యాప్, సైబర్ భద్రత, అత్యవసర సేవలు వంటి కీలక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా కడప వన్ టౌన్ ఎస్.ఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ “మహిళలు సంక్షోభంలో చిక్కుకునే ప్రతి సారి పోలీస్ శాఖ వారి పక్కనే నిలబడే శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా ‘శక్తి యాప్’ మరియు 112 అత్యవసర సేవలు పనిచేస్తున్నాయి.” అని స్పష్టం చేశారు.SOS నొక్కిన క్షణంలోనే నియంత్రణ గదికి అలర్ట్ చేరి, 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరేలా సదుపాయం ఉందని తెలిపారు.
హెల్ప్లైన్లే మహిళల రక్షణ ఆయుధాలు 112, 1091, 181, 1930 వంటి కీలక హెల్ప్‌లైన్ నంబర్లు ప్రతి మహిళ చేతిలో ఉండాల్సిన రక్షణ ఆయుధాలు అని తెలిపి, గతం లో లవ్ అనే వల లో చిక్కి అమ్మాయిలు వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. కొంతమంది అమ్మాయిలు ప్రాణాలే కోల్పోయారని గతం లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రస్తావించారు.
ప్రమాదాలను ముందుగానే గుర్తించే పద్ధతులు, స్వీయ రక్షణ టెక్నిక్స్ గురించి వివరించారు.
సైబర్ భద్రత — అప్రమత్తతే రక్షణ
మహిళలను లక్ష్యంగా చేసుకుని పెరిగిపోతున్న సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, UPI/OTP ఫ్రాడ్స్, సోషల్ మీడియా వేధింపులు గురించి కడప వన్ టౌన్ ఎస్.ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.డిజిటల్ ప్రపంచంలో ప్రతి క్లిక్ ముందు ఆలోచన — అప్రమత్తతే మీ రక్షణ” అని విద్యార్థినులకు స్పష్టం చేశారు. ‘శక్తి’ యాప్ — మీ చేతిలోనే పోలీస్ రక్షణ. అధికారులంతా విద్యార్థినులకు శక్తివంతమైన సందేశం ఇచ్చారు.“శక్తి “ యాప్ మీ చేతిలోని మొబైల్ లో ఉంటే… పోలీస్ రక్షణ మీ వెంటే !” అని కడప వన్ టౌన్ ఎస్.ఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.




