
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 14:కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని యూకేఎఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 13, 14 తేదీలలో జరిగిన సౌత్ జోన్ క్రీడా పోటీల్లో పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.జాతీయ స్థాయి పోటీల్లో తమ సత్తా చాటి కళాశాలకు,పులివెందుల ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారని ప్రిన్సిపల్ బ్రిట్టో హర్షం వ్యక్తం చేశారు.కళాశాలకు చెందిన సాల్మన్ రాజు మరియు సి.నాగమణికంఠ టేబుల్ టెన్నిస్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి విన్నర్స్ గా విజయం సాధించారని,లాంగ్ జంప్ విభాగంలో అజరుద్దీన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలియజేశారు.కళాశాల నుండి ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపిక కాగా ముగ్గురూ పతకాలు సాధించడం విశేషమని ప్రిన్సిపల్ తెలిపారు.శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.




