Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్క్రైమ్రాజకీయంవైరల్

దిశ ఒన్ స్టాప్ కేంద్రం పరిశీలించిన న్యాయమూర్తి

దిశ ఒన్ స్టాప్ కేంద్రం పరిశీలించిన న్యాయమూర్తి.

కర్నూలు బ్యూరో మన జనప్రగతి ఫిబ్రవరి 23:-

 

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో గల దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళాప్రాంగణం (శక్తి సదన్) ను న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి పరిశీలించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు గల దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళాప్రాంగణం (శక్తి సదన్) ను తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది విధులకు ఆలస్యంగా హాజరవుతున్నట్టు గమనించి కచ్చితంగా సిబ్బంది అందరు ఆఫీసు సమయపాలన పాటించాలని ఆదేశించారు.కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించగా రిజిస్టర్లు సక్రమంగా లేవని గుర్తించారు. రిజిస్టర్లలో సంబంధిత అధికారుల సంతకాలు లేవని వాటి గురించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు.సెంటర్లో చేరే వారి వివరాలు వారి రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేయాలని అలాగే సంబంధిత అధికారుల సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు.ఈ సదస్సులో అక్కడ ఉన్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ ఆక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయంను పొందుటకు అర్హులని తెలిపారు. వారి భోజన వసతి సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్య వస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు కాల్ చేయవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబందిత అధికారులు,తదితరులు పాల్గొనారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button