
పులివెందులలో 98 వార్డు నామినేషన్లు చెల్లుబాటు
టిడిపి నుంచి 68, వైఎస్సార్సీపీ నుంచి 25 నామినేషన్లు
పులివెందుల మున్సిపాలిటీలో వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం 98 నామినేషన్లు చెల్లుబాటైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులకు 105 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలనలో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 98 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
పార్టీల వారీగా చెల్లుబాటైన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ నుంచి 68, వైఎస్సార్సీపీ నుంచి 25, బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 1, స్వతంత్ర అభ్యర్థిగా 1 నామినేషన్ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారింది.