పులివెందుల అభివృద్ధికి ‘వైఎస్’ కుటుంబమే భరోసా పాడా నిధులు

పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 23:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పులివెందుల అభివృద్ధిని గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (PADA) నిధులను నిలిపివేసి, అభివృద్ధిని అటకెక్కించిన తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చెరిపివేస్తూ ప్రభుత్వం మారగానే పాడాను నిర్వీర్యం చేసి గతంలో మంజూరైన పనులను నిలిపివేసినా, పులివెందుల ప్రజల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నడుం బిగించారన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోయినా తమ ఎంపీ నిధుల నుండి దాదాపు రూ.2 కోట్ల రూపాయలను మున్సిపాలిటీకి మంజూరు చేయించి అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తున్నారు.ఇందులో భాగంగానే భాకరాపురం సచివాలయం నుండి త్రిలోక్ మార్ట్ వరకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం మున్సిపల్ ఇంచార్జి వైఎస్ మనోహర్ రెడ్డి,మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకోవాలని చూసినా వైఎస్ కుటుంబం పులివెందుల గడ్డను విస్మరించదు అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ హఫీజ్,పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్,కౌన్సిలర్ కోడి రమణ,రాజశేఖర్ రెడ్డి,గండి రాము పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.