Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్వైరల్

వై వి యు పి.జి పరీక్షలు ప్రారంభం.. వీసీ ఆకస్మిక తనిఖీ

 

కడప యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్రాలుగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హల్ టికెట్ లను పరిశీలించారు. 422 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 08 మంది గైర్హాజరయ్యారు. ప్రొద్దుటూరు ఎస్.సి.ఎన్నార్ ప్రభుత్వ కళాశాలలో 71 మంది పరీక్షలకు హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారని పరీక్షల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె ఎస్ వి కృష్ణారావు తెలిపారు. వై వి యు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆచార్య కాత్యాయని పరీక్షల నిర్వహణ గురించి వివరించారు. సీసీ కెమెరాలు ద్వారా సూపరింటెండెంట్ గది నుంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వి.సి. సూచించారు. పరీక్షల నిర్వహణలో సహయ పర్యవేక్షకులు డా టి. లక్ష్మీ ప్రసాద్, సిబ్బంది చంద్రమౌళి పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button