
ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.
నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లోని కొన్ని వార్డులకు నామినేషన్ల స్వీకరణకు మరో అవకాశం…*
కడప నగరపాలక సంస్థలో 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55వ వార్డులకు నామినేషన్ల పొడిగింపు.
రాజంపేటలో 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27వ వార్డులకు అవకాశం…*
*మైదుకూరులోని మొత్తం 32 వార్డులకు నామినేషన్ల స్వీకరణ..
తిరుపతి నగరపాలక సంస్థలో 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66వ వార్డులకు అవకాశం..
*అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ…*
ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలతో పాటు సంబంధిత కలెక్టరేట్లలోనూ నామినేషన్లు స్వీకరించాలని ఆదేశం
కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 25న ఉదయం 8 గంటల నుంచి…
కొత్తగా నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే అక్టోబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు…
100 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటల తర్వాత..
పోలింగ్ నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
అవసరమైతే రీపోలింగ్ నవంబర్ 2న
ఓట్ల లెక్కింపు నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి.
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్లకు ఆటంకాలు ఎదురైన చోట్ల ఆధారాలు, నివేదికలను పరిశీలించి ఎస్‌ఈసీ…




