
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 01:పులివెందుల ప్రాంతంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలంటే సభ్యత్వాల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ‘మానవత’ స్వచ్ఛంద సేవా సంస్థ పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం స్థానిక గీతా మందిరంలో సంస్థ సెక్రటరీ ముక్కోటి శేషయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీదేవి రెడ్డి సదాశివారెడ్డి,రిటైర్డ్ తహసిల్దార్ సి.రామిరెడ్డి,పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.వి.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ,మానవత సంస్థ సేవలు నిశ్శబ్దంగా, అద్భుతంగా ప్రజలకు అందుతున్నాయని కొనియాడారు.సంస్థ చేస్తున్న సేవలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా సభ్యత్వాలు పెరిగి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని,అప్పుడు ఇంకా ఎక్కువ మందికి సాయం చేయవచ్చని సూచించారు.సమాజంలో క్షీణిస్తున్న మానవీయ విలువలను పునరుద్ధరించడానికి సంస్థ కట్టుబడి ఉండాలని గౌరవ సభ్యులు లక్ష్మీనారాయణ, విశ్వనాథరెడ్డి,గంగిరెడ్డి,రామ్ రెడ్డి,దీనబంధు జనార్దన్ రెడ్డిలు పలు సూచనలు చేశారు.సంస్థ చైర్మన్ శ్రీదేవి రెడ్డి వెంకట కొండారెడ్డి మాట్లాడుతూ, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు తమ బాధ్యతలను గుర్తుంచుకుని,సంస్థ బలోపేతానికి నైతిక సహకారాన్ని అందించాలని కోరారు.ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు రాఘవరెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, జోగేంద్ర నాథ్ రెడ్డి,సిరి భరద్వాజ రెడ్డి, గజ్జల శివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,పి.అంకిరెడ్డి తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.విచ్చేసిన సభ్యులకు సెక్రటరీ ముక్కోటి శేషయ్య అల్పాహార ఏర్పాట్లు చేశారు.




