
పులివెందుల, అక్టోబర్ 20: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆదేశాల మేరకు, రానున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో పులివెందుల డీఎస్పీ బి. మురళి పులివెందుల ఆర్డీవో చెన్నయ్య స్ట్రాంగ్ రూమ్లను సందర్శించి పరిశీలించారు.ఎన్నికలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపట్టాల్సిన జాగ్రత్తలు, పటిష్టమైన భద్రతా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.పులివెందుల అర్బన్ సి.ఐ పురుషోత్తం రాజు, సిబ్బంది పాల్గొన్నారు.