అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్జాతీయంరాజకీయం

నెల్లూరులో నారాయణ మార్క్ అభివృద్ధి

మన జనప్రగతి మే 03:-

నెల్లూరు సిటీ అభివృద్ధిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దూకుడు పెంచారు..ఆదివారం సాయంత్రం సంతపేటలో పర్యటించిన మంత్రికి మహిళలు పూల వర్షంతో నీరాజనాలు పలికారు .అభివృద్ధి ప్రదాతకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం బుజ్జమ్మరేవు దోభీఘాట్‌ను సందర్శించిన మంత్రి, రజకుల సమస్యలను విని స్పందించారు .ఆధునీకరణ పనులకు ఎస్టిమేషన్లు వేయాలని ఆదేశించడంతో రజకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రంగనాయకులపేటలోని పినాకినీ పార్క్, బోడిగాడి తోటలో శరవేగంగా సిద్ధమవుతున్న నూతన పార్కులను కూడా పరిశీలించారు.నెల్లూరు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారుఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,మేయర్ సుజాతా అశోక్ ,రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ,రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్షర్ కపిర శ్రీనివాసులు ,ప్రెసిడెంట్ సిద్దయ్య ,వైస్ ప్రెసిడెంట్ గుణుకుల నరసింహారావు ,మహిళా క్లస్టర్ కపిర రేవతి ,5వ డివిజన్ క్లస్టర్ శశి ,ప్రెసిడెంట్ కూలి గంగాధర్ టీడీపీ సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజేశ్వరి స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button