
లింగాల మండల విద్యాశాఖ అధికారులు
లింగాల మన జనప్రగతి ఫిబ్రవరి 26:రాష్ట్రంలోని అట్టడుగు మరియు పేద వర్గాల విద్యార్థుల కోసం విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చిందని 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్ల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయని మండల విద్యాశాఖ అధికారులు రామకృష్ణయ్య మరియు విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ 25 శాతం ఉచిత సీట్ల భర్తీకి అనాథలు,దివ్యాంగులు,హెచ్ఐవి బాధితులతో పాటు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మరియు ఓసీ వర్గాలలోని అల్ప ఆదాయ వర్గాల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.ఈ చట్టం కింద ఎంపికైన విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వారి విద్యా ఖర్చులను ప్రభుత్వమే నేరుగా ప్రైవేట్ పాఠశాలలకు చెల్లిస్తుందని,విద్యార్థి నివాసానికి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ పొందే వెసులుబాటు ఉంటుందన్నారు.పేదవిద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అర్హులైన తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దన్నారు.అడ్మిషన్ల ప్రక్రియ మార్చి 30వ తేదీ వరకు ఉంటుందని,ఆన్లైన్ దరఖాస్తుల కోసం వెంటనే మీ పరిధిలోని గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించలని కోరారు.




