
ఆదోని మన జనప్రగతి మార్చి 06:- ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు, వారి బంధువులకు ఏఐఎంఐఎం పార్టీ ఆదోని పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ జునైద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో ఏఐఎంఐఎం నాయకులు రోగులకు వారి బంధువులకు అల్పాహారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ జునైద్ మాట్లాడుతూ రోగులు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ప్రతి శుక్రవారం వారికి ఉచితంగా అల్పాహారం, పండ్లు,పాలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం నాయకులు సద్దాం హుస్సేన్, నాసిర్ హుస్సేన్, ఖాసీం, మహబూబ్ సాహెబ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.




