
ఆడోళ్లు కట్టెలు తెస్తున్నారు: పులివెందుల డీఎస్పీ
పులివెందులలో అందరూ ఓటు వేసేలా చూస్తున్నామని డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పట్టణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద కొందరు ఆందోళనకు దిగారు. తమను ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో డీఎస్పీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అందరికీ ఉంటుంది. కొందరు ఆడోళ్లు కట్టెలతో రావడంతో అడ్డుకున్నాం. ప్రశాంత వాతావరణంలో అందరి చేత ఓటు వేయించేలా చర్యలు తీసుకుంటాం’ అని డీఎస్పీ చెప్పారు.




