
కర్నూలు బ్యూరో మా జనప్రగతి మార్చి 01:- రాష్ట్ర డిజిపి శ్రీ హారీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో , కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ల ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ప్రారంభించామని కర్నూలు అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా తెలిపారు. ఆదివారం ఆయన ఈ సంధర్బంగా మీడియా తో మాట్లాడుతూ
మార్చి 8 వ తేదిన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా వారోత్సవాలను ప్రారంభించామన్నారు.
ప్రభుత్వం,పోలీసు యంత్రాంగం మహిళలకు, విద్యార్ధులకు, చిన్నారులకు సాధికారత కల్పించే ఉద్దేశ్యంతో మహిళా పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఒక వారం రోజుల పాటు విద్యార్ధులు, మహిళలతో కలిసి మహిళా సాధికారత, మహిళల భద్రత అంశాల పై అవగాహన ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, పెయింటింగ్, డ్రాయింగ్, వక్తృత్వ, వ్యాస రచన పోటీలు, హెల్త్ క్యాంప్స్ , ఓపెన్ హౌస్ , సాంస్కృతి కార్యక్రమాలు,బ్యాండ్ షోలు నిర్వహిస్తామన్నారు.
వ్యాస రచన, వక్తృత్వ విజేతలకు బహుమతులు పంపిణి చేస్తామన్నారు.
మహిళలు, విద్యార్ధులు, చిన్నారులు బాగా చదువుకుని ఉన్నత స్ధానాలను చేరుకోవాలన్నారు.
మహిళల పట్టుదల, ఆత్మవిశ్వాసం సమాజ ప్రగతికి బలమైన పునాది అన్నారు.
ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112 , చైల్డ్ లైన్ 1098 , సైబర్ క్రైమ్ హైల్ప్ లైన్ 1930 కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమం ర్యాలీ కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి ప్రారంభమై కోల్స్ కళాశాల మీదు గా పాత కంట్రోల్ రూం వరకు అక్కడి నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగింది.
ఆకతాయిల ఆట కట్టిస్తాం తిరుగుబోతుల తాట తీస్తాం,
ఒంటిరిగా ప్రయాణిస్తున్నారా శక్తి యాప్ ఉపయోగించండి అనే స్లోగాన్స్ తో ఫ్లకార్డులు పట్టుకుని అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్, కర్నూలు మహిళా పియస్ సిఐలు రామయ్య నాయుడు, విజయలక్ష్మీ, కర్నూలు పట్టణ సిఐలు పార్థసారథి, నాగరాజా రావు, మన్సురుద్దీన్, ఆర్ ఐలు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు, శక్తి టీం మహిళా పోలీసులు, సచివాలయ పోలీసులు, శ్రీలక్ష్మీ, చైతన్య, కెవిఆర్ కళాశాల, సిరాక్ స్కూల్ విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.



