
కాకినాడ, మన జనప్రగతి ఫిబ్రవరి 26: – సజేఎన్టీయూకే పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ (యూసీఈకే) వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పరిపాలనాపరమైన ఉత్తర్వులను జారీ చేశారు. వీసీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కె పద్మరాజుని యూనివర్సిటీ (యూసీఈకే) ప్రిన్సిపాల్‌గా నియమించారు. అదేవిధంగా ఇప్పటి వరకు యూసీఈకే ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ మోహన్ రావుని ప్రిన్సిపాల్ బాధ్యతల నుండి రిలీవ్ చేశారు.ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలనా సమర్థత సాధనలో కొత్త ప్రిన్సిపాల్ సమర్థంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మోహన్ రావు ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో చేసిన సేవలను వీసీ అభినందించారు.




