Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్తెలంగాణరాజకీయంలైఫ్ స్టైల్వైరల్

సింహాద్రిపురంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన

జడ్పీటీసీ మారెడ్డి లత రెడ్డి

సింహాద్రిపురం మన జనప్రగతి ఫిబ్రవరి 28:-

గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం శనివారం సింహాద్రిపురం మండలంలో ఘనంగా ప్రారంభమైంది. పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లత రెడ్డి,మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మరియు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఈ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మారెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని స్వచ్ఛ రథం ద్వారా వ్యర్థాల నిర్వహణ సులభతరం అవుతుందని ప్రజలు తమ వద్ద ఉన్న పనికిరాని సామాగ్రిని ఇచ్చి,వాటికి ప్రతిగా నిత్యవసరాలను పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.గ్రామాల్లోని ఇళ్ల నుంచి వృధా సామాగ్రిని (పాత సామాన్లు, ప్లాస్టిక్ వంటివి) స్వచ్ఛ రథం సేకరిస్తుందని ఆ వృధా సామాగ్రికి బదులుగా ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత అని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కోరారు. దీనివల్ల గ్రామాలు శుభ్రంగా ఉండటమే కాకుండా, వ్యర్థాలకు విలువ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శులు, మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button