
తిరుపతి మన జనప్రగతి ఫిబ్రవరి 23:-
నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా, 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ కమిషనర్ ను కోరారు. లక్ష్మీపురం కూడలి ప్రారంభించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, 18వ వార్డులోని స్మశానం వద్ద మౌళిక సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్ ఎస్. కె బాబు ఫోన్ ద్వారా కోరారు. టీటిడి పరిపాలనా భవనం పక్కన గల రోడ్డులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ బి అతిధి గృహం యూడీస్ వలన ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని, పద్మావతి పార్క్ వాకింగ్ ట్రాక్ బాగు చేయాలని, కృష్ణాపురం టానా వద్ద తోపుడు బండ్లు ఎక్కువ కావడంతో పార్కింగ్ ఇబ్బందిగా ఉంది పరిశీలించాలని, డివైడర్ల మధ్య చెట్లు ఏండి పోతున్నాయి నీరు పట్టాలని, సీపీయం కార్యాలయం వద్ద రోడ్లు గుంతలు పూడ్చాలని, జగజ్జీవన్ రామ్ పార్క్ వద్ద పెద్ద కాలువ బ్లాక్ అయ్యింది పరిష్కరించాలని, మహిళా వర్సిటీ రోడ్డు ను ఇరువైపులా చిరు వ్యాపారులు ఆక్రమించడంతో ఇబ్బందిగా పరిష్కరించాలని, టిడిఆర్ బాండ్లు ఇప్పించాలని, కొబ్బరికాయల వ్యాపారస్థులు ఎక్కడివక్కడే పడేస్తున్నారు చర్యలు చేపట్టాలని, రైల్వే కాలనీ పార్క్ వద్ద చెత్త కాలుస్తున్నారు చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు, ఏసీపీ లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.




