ఆంధ్ర ప్రదేశ్క్రైమ్లైఫ్ స్టైల్వైరల్

బోడివారిపల్లిలో భారీ అగ్నిప్రమాదం

బూడిదైన గడ్డివాము,కన్నీరుమున్నీరవుతున్న రైతు

తొండూరు మన జనప్రగతి మార్చి 01:తొండూరు మండలం బోడివారిపల్లి గ్రామంలో ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదం ఒక రైతును కోలుకోలేని దెబ్బతీసింది.కొండ ప్రాంతం నుంచి వచ్చిన నిప్పు రవ్వలు గడ్డివామును అంటుకోవడంతో సుమారు లక్ష రూపాయల విలువైన పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది.బాధిత రైతు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సమీపంలోని కొండ ప్రాంతం నుంచి అగ్నిజ్వాలలు ఎగిసిపడి ఆయన పొలంలోని గడ్డివాముకు అంటుకున్నాయి.ఎండ తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ,వారు ఘటనాస్థలానికి చేరుకునేలోపే గడ్డివాము పూర్తిగా కాలి బూడిదైపోయింది.ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల విలువైన పశుగ్రాసం నష్టం వాటిల్లిందని రైతు శ్రీనివాసరెడ్డి వాపోయారు.ఏడాది పొడవునా పశువుల కోసం నిల్వ చేసుకున్న మేత కాలిపోవడంతో,ఇప్పుడు పశువులకు గడ్డి ఎక్కడి నుండి తేవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button