అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్క్రైమ్తెలంగాణరాజకీయంవైరల్

అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం

అన్ని విధాలా ఆదుకుంటాం. చంద్రబాబు

 

కాకినాడ మన జనప్రగతి ఫిబ్రవరి 28 :-సామర్లకోట మండలం వేట్లపాలెంలో గ్రామంలో గల ‘సూర్య ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించి మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా దారుణమని ప్రమాదం జరిగిన విధానం హృదయపూర్వకంగా ఉందని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఏది ఏమైనా

ఈ దుర్ఘటనలో 23, మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం ,6, వరకు తీవ్ర గాయాలు అవ్వడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట కలెక్టర్ సగిలి సన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పివిఎన్ మాధవ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతిని నవీన్ కుమార్, మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, గుణ్ణం చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ, జిల్లా అధికారులు తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button