Featuredఆంధ్ర ప్రదేశ్జాతీయంరాజకీయంవైరల్సినిమా

షర్ట్ మడతబెట్టా.. ఎవరు వస్తారో రండి: జగన్ సవాల్

పోలింగ్‌కు ముందు రోజు పులివెందులకు వస్తా.. బూత్‌కు వెళ్లి ఓటేస్తా

షర్ట్ మడతబెట్టా.. ఎవరు వస్తారో రండి: జగన్ సవాల్

పోలింగ్‌కు ముందు రోజు పులివెందులకు వస్తా.. బూత్‌కు వెళ్లి ఓటేస్తా

పులివెందుల, మన జనప్రగతి:

పులివెందుల పర్యటన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరారు. పోలింగ్‌కు ముందు రోజు రాత్రే పులివెందులకు వచ్చి, పోలింగ్‌ బూత్‌కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు.

“ఇప్పటికే షర్ట్‌ మడతబెట్టా.. ఎవరు వస్తారో రండి” అంటూ జగన్‌ వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు చేయి వేస్తే తనపై చేయి వేసినట్లేనని అన్నారు.

“మా సమయం వచ్చినప్పుడు అన్యాయం చేసే ఏ అధికారినీ వదిలిపెట్టం. వారు రిటైర్‌ అయినా తీసుకొస్తాం” అంటూ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా విధులు నిర్వహించాలని సూచించారు.

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జగన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button