గురువారం లోపు మోటర్లు ఆడాల్సిందే
ఎంపీ అవినాష్ రెడ్డి
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఏప్రిల్ 23:నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కూటమి ప్రభుత్వ వైఫల్యంపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి,సతీష్ కుమార్ రెడ్డి రైతులతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులను కలిశారు.లింగాల,వేముల మండలాల్లో ఎత్తిపోతల పథకాలు అధ్వానంగాఉన్నాయని,నిర్వహణ లోపం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.సీబీఆర్ రిజర్వాయర్లో 10 టీఎంసీ ల నీరు ఉన్నప్పటికీ,మోటర్ల రిపేర్లు చేయించకపోవడం వల్ల పంటలకు నీరు అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.మేము సొంత ఖర్చుతో రిపేర్ చేస్తామన్నా పర్మిషన్ లేదనడం చిల్లర రాజకీయం అని ఎంపీ విమర్శించారు.రైతుల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని కోరారు.వెలిదండ్ల కెనాల్,కుంట మరియు తాతిరెడ్డిపల్లె వద్ద మోటర్లను వచ్చే గురువారం లోపు పని చేసేలా చూడాలని,లేనిపక్షంలో మే 1న రైతులతో కలిసి భారీ ఎత్తున ఆందోళన చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో రాజకీయాలు పక్కన పెట్టి,రైతులకు తక్షణమే నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లింగాల వేముల మండల నాయకులు మరియు రైతులు భారీగా పాల్గొన్నారు.




