
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 24:
సింహాద్రి పురం పోలిస్టేషన్లో లంచం తీసుకుంటూ ఎస్సైతో సహా ఏసీబీకి పట్టుబడిన సీఐ ఎన్వి రమణ నివాసంలో తెల్లవారుజాము వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా సిఐ రమణ కు చెందిన బంధువులు కదిరి, తదితర బంధువుల గృహాలలో కూడా సోదరులు నిర్వహించారు. అంతకుముందు స్థానిక మైత్రి లేఔట్ లోని సీఐ ఇంటిలోని విలువైన బంగారు వస్తువులు, డాక్యుమెంట్లు ఒక హోమ్ గార్డ్ రెండు సంచుల్లో తరలిస్తుండగా ఏసీబీ అధికారులు తనిఖీలకు రావడంతో హోంగార్డ్ ఆ వస్తున్న అక్కడే వదిలి పరార్ అయినట్లు స్థానికులు తెలిపారు.హోంగార్డ్ పారవేసిన వస్తువులను డాక్యుమెంటను ఏసీబీ అధికారులు స్వాధీన పరుచుకున్నారు.సీఐ నివాసంలో ఆదాయానికి మించిన బంగారు,ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికైనా సీఐ నివాసాలు బ్యాంకులో రిజిస్టర్ కార్యాలయాలు తనిఖీ చేపట్టామని,ఇంకా దర్యాప్తు చేపట్టాల్సి ఉందని దర్యాప్తు పూర్తి అయ్యాక ఆదాయానికి మించిన ఆస్తులు తేలితే సీఐ రమణ పై మరొక కేసు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం సీఐ రమణ ఎస్ ఐ అనిల్ కుమార్ లను ఏసీబీ అధికారులు కర్నూలు కోర్టుకు తరలించారు.




