ఆంధ్ర ప్రదేశ్రాజకీయంవైరల్

నూతన వధూవరులకు వైఎస్ మనోహర్ రెడ్డి ఆత్మీయ ఆశీస్సులు

నూతన వధూవరులకు వైఎస్ మనోహర్ రెడ్డి ఆత్మీయ ఆశీస్సులు

 

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసిపి శ్రేణులు

 

పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 23:

 

పులివెందుల పట్టణ పరిధిలో గురువారం ఎస్సీ ఎస్సార్ ఫంక్షన్ హాల్ నందు గురు సాయి తేజ అర్చన వివాహ వేడుకలు కళ్యాణం కమనీయంగా అత్యంత వైభవంగా జరిగాయి.ఈ వివాహ వేడుకలకు రాచనేని వెంకటనారాయణ లక్ష్మమ్మ ప్రత్యేక ఆహ్వానం మేరకు పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్,పులివెందుల పట్టణ వైకాపా అధ్యక్షుడు హాల్ గంగాధర్ రెడ్డి,పులివెందుల పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్,బలిజ సంఘం నాయకులు తోటంశెట్టి హరి, ఐటి ఆంజనేయులు కుప్పాల శ్రీరామ్ సుబ్బయ్య లు హాజరై నూతన వధూవరులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని వివాహ బంధం అతి పవిత్రమైనదని తెలియజేస్తూ వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం కళ్యాణ వేడుకలలో పలువురు వైయస్ మనోహర్ రెడ్డిని వైసిపి శ్రేణులను ఆప్యాయంగా పలువురు పలకరిస్తూ వివాహ వేడుకలలో గడిపారు.ఈ కార్యక్రమంలో రాచనేని వెంకటనారాయణ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button