
ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేయడం రాచమల్లు నైజం
9 కోట్ల 30 లక్షలు శనగల కొనుగోళ్లు జరిగితే 13 కోట్ల అవినీతి ఎలా సాధ్యం
టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, పట్టణ అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్
ప్రొద్దుటూరు మన జనప్రగతి మార్చి 14 :-
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఆయన తనయుడు నంద్యాల కొండారెడ్డి పై నిత్యం నిరాధారమైన ఆరోపణలు చేయడం మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నైజమణి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జేబీ ఉల్లా టిడిపి పట్టణ అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం కానీ టిడిపి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ శనగల కొనుగోలు కేంద్రంలో 13 కోట్ల అవినీతి జరిగిందంటూ రాచమల్లు చేసిన ఆరోపణలపై వారు ఘాటుగా స్పందించారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి మరియు వారి తనయుడు కొండారెడ్డి పై నిరాధారమైన ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేయడం తగదు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న సదుద్దేశంతో మార్కెట్లో సెనగలు 5 వేలు ఉంటే ప్రభుత్వం 5875తో కొనుగోలు చేస్తుందన్నారు. గత వైసిపి పాలనలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. శనగల కొనుగోలు కేంద్రంలో రాచమల్లు అవినీతి ఆరోపణలపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు తాము సంబంధిత అధికారులను విచారించగా ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారని తెలిపారు. ఇప్పటివరకు 15697 క్వింటాళ్లు శనగలు కొనుగోలు చేస్తే 9 కోట్ల 30 లక్షలు వ్యాపార లావాదేవీలు జరిగాయని కానీ రాచమల్లు 13 కోట్లు అవినీతి జరిగిందంటూ రాద్ధాంతం చేయడంలో ఆంతర్యం ఏమని ప్రశ్నించారు. కేవలం ఉనికి కోసమే ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి పై నిత్యం అవినీతి మరకలు అంటించే ప్రయత్నమేనని తెలిపారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఎప్పటికీ అవినీతిని ప్రోత్సహించడని అది ప్రజలకు తెలుసని గత వైసిపి పాలనలో రాచమల్లు చేసిన అరాచకాలు నూతన కూరగాయల మార్కెట్లో చేసిన అవినీతి అక్రమాలు ప్రజలకు తెలుసు అన్నారు. అవినీతి అంతా మీరు చేసి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేవలం నంద్యాల వరదరాజులు రెడ్డి అభిమానులు కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారన్న ఒకే ఒక కారణంతో ఎమ్మెల్యే పై రాచమల్లు విమర్శలు చేస్తున్నారని అన్నారు. నిజంగా రైతులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే మార్కెట్లోకి వచ్చి పరిశీలించవచ్చని ఎవరు అడ్డు చెప్పరని అన్నారు ఇప్పటికైనా ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు రసూల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.




