Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంలైఫ్ స్టైల్వైరల్

నెల్లూరు సిటీలో అభివృద్ధి జైత్రయాత్ర

2 కోట్లతో నూతన పనులకు మంత్రి నారాయణ శ్రీకారం

నెల్లూరు మన జనప్రగతి ఫిబ్రవరి 28:-

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా గాంధీబొమ్మ సెంటర్ స్వతంత్ర పార్కు వద్ద 75 లక్షల రూపాయలతో మూడు డ్రైన్లు, కల్వర్టు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. ఈ పనులను మార్చి ఆఖరుకల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 48వ డివిజన్ పొర్లుకట్ట వాసుల 60 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరిస్తూ, కోటి 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. నగరాన్ని ముంపు ముప్పు నుండి తప్పించేందుకు 15 ప్రధాన కాలువల ఆధునీకరణ చేపడుతున్నామని, కాలువలపై కొత్త రోడ్లు నిర్మించి నెల్లూరును దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి పనులపై కొందరు అసత్య ప్రచారాలతో రాజకీయం చేస్తున్నారని, ప్రజలు అలాంటి మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. ప్రజల సహకారం ఉంటే నెల్లూరును దేశంలోనే అత్యుత్తమ స్మార్ట్ సిటీగా మారుస్తానని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్లు తహసీన్ ఇంతియాజ్ మరియు రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ ,మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ పెంచలయ్య, ఇంచార్జ్ కీర్తి,కో-క్లస్టర్ షేక్ జాఫర్, బూత్ కన్వీనర్లు నౌషాద్, ఫయాజ్, బ్రహ్మయ్య స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button