Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

గడువులోగా సమస్యలను పరిష్కరించాలి

కలెక్టర్ షాన్ మోహన్

కాకినాడ మన జనప్రగతి ఫిబ్రవరి 23:- ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలలో నమోదైన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.

సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, సీపీవో పీ త్రినాథ్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు డీఎల్పీవో వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి హాజరై, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 745 అర్జీలు అందాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఒకే అంశంపై మళ్ళీ మళ్ళీ దఖలయ్యే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నూరు శాతం సంతృప్తికరమైన పరిష్కారాలు ఇవ్వాలని ఆయన ఆయన అధికారులను

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button