
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మే 03:-ప్రజా హక్కుల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తామని, అసాంఘిక కార్యక్రమాల అణిచివేతలో ప్రజలు తమ వంతు సహకారాలు అందించాలని పులివెందుల అర్బన్ సిఐ శ్రీరామ్ పేర్కొన్నారు.ఆదివారం పులివెందుల అర్బన్ స్టేషన్ నందు వివిధ సమస్యల పరిష్కారం కోసం తనను ఆశ్రయించినటువంటి ప్రజలకు భరోసా కల్పిస్తూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణ పోలీసుల బాధ్యత అని వాటి సంరక్షణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలను అణిచివేయడానికి బాధ్యత గల పౌరులు ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చి మంచి సమాజ నిర్మాణానికి సహకరించాలని తెలియజేశారు.




