Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorizedఆంధ్ర ప్రదేశ్రాజకీయం

శనగ రైతులకు వరం మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం



పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి ప్రత్యేక కృషితో సాకారం

క్వింటాల్‌కు రూ.5,875/- మద్దతు ధర

పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ

పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 23:

పులివెందుల నియోజకవర్గంలోని శనగ రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యంగా,పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి ప్రత్యేక కృషి,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో నేటి నుంచే మద్దతు ధరతో శనగల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ యాదవ్ మాట్లాడుతూ
రైతులు తమ పంటను అమ్ముకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది లేకుండా,ప్రతి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రాల (RBK) వద్దే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,ప్రభుత్వం క్వింటాల్ శనగలకు రూ.5,875/- మద్దతు ధరగా నిర్ణయించిందన్నారు.
పంట విక్రయించిన 15 రోజుల్లోనే నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుందని,ఈ-క్రాప్ (e-Crop) లో నమోదైన రైతులందరికీ ఈ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం ఉంటుంది.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని,దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని అమర్నాథ్ యాదవ్ కోరారు.పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button