అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్తెలంగాణరాజకీయంవైరల్

వేముల మస్జీద్‌లో ఆత్మీయంగా ‘ఇఫ్తార్ విందు’.

వేల్పుల రాము ఆధ్వర్యంలో ముస్లిం సోదరులతో ప్రార్థనలు

వేముల మన జనప్రగతి మార్చి 14:-పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వేముల మండల కేంద్రంలోని స్థానిక మస్జీద్‌లో శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని మండల పరిశీలకుడు లింగాల రామలింగా రెడ్డి (వేల్పుల రాము) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేల్పుల రాము మాట్లాడుతూ..రంజాన్ మాసం త్యాగం,సహనం,పరస్పర ప్రేమను తెలియజేసే పవిత్ర కాలమని పేర్కొన్నారు.ఇఫ్తార్ విందులు సమాజంలో సోదరభావం,ఐక్యతను మరింత బలపరుస్తాయని అన్నారు.మతభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించడం సమాజానికి ఎంతో అవసరమని ఆయన తెలిపారు.రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో భాగంగా రామలింగారెడ్డి తల్లి లింగాల పార్వతమ్మ ముస్లిం మహిళలకు దాదాపు 700 పైగా చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మహిళలు మరియు స్థానిక ప్రజలు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేలా మరింతగా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యుడు నూరుల్లా,ముస్లిం మైనార్టీ నాయకులు,స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button