Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్క్రైమ్ట్రావెల్రాజకీయంవైరల్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి

కమలాపురం మన జనప్రగతి మార్చి14:కమలాపురంలో పేద ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ – ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కమలాపురం నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరీమణులకు అండగా నిలిచేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.శనివారం స్థానిక దర్గా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.రంజాన్ తోఫాగా నియోజకవర్గంలోని పేద ముస్లిం సోదరీమణులకు నిత్యావసర సరుకులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి పంపిణీ చేశారు.పండుగ వేళ పేదలకు అండగా నిలవడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.అనంతరం దర్గా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నాయకులు పాల్గొన్నారు.ముస్లిం సోదరులతో కలిసి విందు స్వీకరించి,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమలాపురం సమన్వయకర్త నరేన్ రామాంజనేయ రెడ్డి, దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి మరియు ఇతర స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రంజాన్ పర్వదినం సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం పట్ల స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button