Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorizedఅంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్క్రైమ్రాజకీయంవైరల్

పులివెందుల రూరల్ సీఐగా శాంతి లాల్ బాధ్యతలు

పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 28:-కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఉత్తర్వుల మేరకు,పులివెందుల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా శాంతి లాల్ నియమితులయ్యారు.శుక్రవారం రాత్రి 9:00 గంటలకు ఆయన పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ను కలిసి రిపోర్ట్ చేశారు.గతంలో కడప విఆర్ లో ఉన్న శాంతి లాల్‌ను జిల్లా ఎస్పీ పులివెందుల రూరల్ సీఐగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీఐ శాంతి లాల్ శుక్రవారం రాత్రి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని,డీఎస్పీ మురళి నాయక్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించే ప్రక్రియను పూర్తి చేశారు.శాంతి భద్రతల పరిరక్షణకు,నేరాల అదుపునకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన సీఐ పేర్కొన్నట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button