ఆంధ్ర ప్రదేశ్క్రైమ్తెలంగాణరాజకీయంలైఫ్ స్టైల్వైరల్

పి జి ఆర్ ఎస్ లో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్ర స్థాయి లో క్షుణ్ణంగా పరిశీలించిపరిష్కరించండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

పి జి ఆర్ ఎస్ లో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్ర స్థాయి లో క్షుణ్ణంగా పరిశీలించిపరిష్కరించండ

 

జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి

కడప మన జనప్రగతి ఫిబ్రవరి 23:-ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను అధికారుల క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు..

 

సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్ సమావేశపు మందిరం నందు..ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా,డిఆర్వో విశ్వేశ్వర నాయుడు,వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ…

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ను ఇచ్చి నిర్వహిస్తోందని,ఇందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయి కి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకం గా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగాపరిష్కరించాలన్నారు.అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలనిఅర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఎండార్స్ మెంట్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగాపరిశీలించాలన్నారు.పిజిఆర్ఎస్ లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలి. జిల్లా అధికారులు వారికి అందిన అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించి సమీక్షా చేయాలన్నారు. అర్జీల పరిష్కారం లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.అలాగే అర్జీలు బియాండ్ ఎస్ ఎల్ ఏ లేకుండా చూడాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో జడ్పి సిఇఓ ఓబుళమ్మ, డి.ఆర్.డి.ఏ. పి.డి. జి.రాజ్యలక్ష్మి, పర్యాటక శాఖ అధికారి సురేష్ కుమార్, కో-ఆపరేటివ్ శాఖ అధికారి వెంకటసుబ్బయ్య,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button