Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్క్రైమ్తెలంగాణరాజకీయంవైరల్

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

కడప అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 23:-జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ ఆదేశాల తో సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయించేలా చర్యలు తీసుకున్నారు జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల సెంటర్ల వద్ద సిఐ లు, ఎస్ఐలతో పాటు, పోలీస్ సిబ్బందిని నియమించి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.సెంటర్ల వద్ద మొబైల్ ఫోన్లు ,ఎలక్ట్రానిక్ పరికరాలు, తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు . అలాగే ప్రశ్నపత్రాల రవాణా భద్రతా పరంగా ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. సెంటర్ల పరిసర ప్రాంతాలలో అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు సంఘటనలు తలెత్తకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button