Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్తెలంగాణరాజకీయంవైరల్

ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్

బీటెక్ రవి ఆదేశం

పులివెందుల మన జనప్రగతి మార్చి 14:-శనివారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి.ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ ప్రజా దర్బార్ సామాన్య ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు.శనివారం నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.బాధితుల నుంచి వినతులను స్వీకరించి,వాటి పరిష్కారం దిశగా భరోసా కల్పించారు.ప్రజలు అందజేసిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన బీటెక్ రవి,సమస్యల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి,ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.నియోజకవర్గ ప్రజల సమస్యలను శ్రద్ధగా విని,వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తామని బీటెక్ రవి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button