Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorizedఆంధ్ర ప్రదేశ్క్రీడలుజాతీయంతెలంగాణలైఫ్ స్టైల్విద్యవైరల్

జేఎన్‌టీయూఏసీఈలో మహిళల సాధికారత – భద్రతపై

వాకథాన్ ఘనంగా నిర్వహణ

పులివెందుల, మార్చి 02 అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2026 సందర్భంగా పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో, డైరెక్టర్ ఆఫ్ ఆధ్యాపిక బృందం మరియు మహిళా ఉద్యోగలు మరియు జె.ఎన్.టి.యు అనంతపూర్ సహకారంతో “మహిళల సాధికారత – భద్రత మరియు రక్షణ” పేరిట వాకథాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివెందుల ద్వితీయ శ్రేణి ప్రత్యేక న్యాయమూర్తి చింతపర్తి అరుణ హాజరై వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. మహిళల భద్రత, సమానత్వం, గౌరవం కోసం ప్రతి ఒక్కరూ చైతన్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాముఖ్యతను వివరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వాటిని వినియోగించడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. విష్ణు వర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. శేష మహేశ్వరమ్మ, మహిళా సాధికారత సమన్వయకర్త డా. షేక్ తాజ్ మహబూబ్ పాల్గొన్నారు. బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాకథాన్‌ను విజయవంతం చేశారు.మహిళల సాధికారత, భద్రతపై అవగాహన పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేషంగా దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button