
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 26:-మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల రెండు రోజుల పర్యటనలో భాగంగా జగన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని,ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని,వైకాపా నియోజకవర్గ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పోరెడ్డి జస్వంత్ రెడ్డి,నానిమహేంద్ర లు కలిశారు.ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు జరిగే అన్యాయాలపై పోరాటం చేయాలన్నారు.విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి తెలిపారు.




