- పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 25:
పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో పర్యటించారు. నందిపల్లి గ్రామంలోని నందీశ్వరాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నందిపల్లికి చేరుకున్న జగన్‌కు దారిపొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు,ప్రజలు ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ, నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల మధ్య స్వాగతం పలికారు.విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా వైయస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నంది విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గం నలుమూలల నుండి భక్తులు,పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో నందిపల్లి గ్రామం జనసంద్రంగా మారింది.




