సింహాద్రిపురం మన జనప్రగతి ఫిబ్రవరి 25:అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా బుధవారం సింహాద్రిపురంలో మార్క్‌ఫెడ్ (మార్క్‌ఫెడ్) మరియు నాఫెడ్ (నాఫెడ్) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, పులివెందుల జడ్పిటిసి మా రెడ్డి లతా రెడ్డి,వేంపల్లె టీడీపీ ఇంచార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి మరియు సింహాద్రిపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి రామసురా రెడ్డి పాల్గొని కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలై నష్టపోకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను ప్రతి ఒక్క రైతూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
సింహాద్రిపురం మండలంతో పాటు పరిసర గ్రామాల శనగ రైతులు తమ పంటను విక్రయించుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది లేకుండా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
గత ప్రభుత్వంలో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని,ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తోందని,గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని బీటెక్ రవి అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుప్పాల శ్రీధర్ రెడ్డి,సింహాద్రిపురం సింగిల్ విండో అధ్యక్షుడు పీజీ గోపాల్ రెడ్డి,వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖల అధికారులు,మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




