
నగర పాలక సంస్థ నూతన మేయర్గా బాధ్యతలు స్వీకరించిన దేవరకొండ సుజాత ని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగర అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. నగరంలో రోడ్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, పారిశుధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.“ప్రజల విశ్వాసం అత్యంత ముఖ్యమైనది. పారదర్శక పరిపాలనతో, సమన్వయంతో పనిచేస్తే నెల్లూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చు,” అని పేర్కొన్నారు. నగరాభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.మేయర్ దేవరకొండ సుజాత స్పందిస్తూ, నగర ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని, ప్రతి వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.




