
దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కోలా ప్రసాద్
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 28:
కాకినాడ జిల్లా మెట్ల పాలెం గ్రామంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనపై దళిత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కోలాప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న అన్నారు.ఈ పేలుళ్లు మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా తగినంత ప్రకటించాలన్నారు.
పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత బాధాకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్న అన్నారు.




