
లింగాల కుడికాలువ నుంచి తాతిరెడ్డిపల్లి బియాండ్ ఎత్తిపోతల పథకం నుంచి కొండకిద గ్రామాలైన కోమన్నూతల,ఎగువ పల్లె,దిగువ పల్లె , మురారి చింతల , గుణకనపల్లె తోపాటు పలు గ్రామాలకు వెంటనే సంబంధిత అధికారులు నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కొండ కింద గ్రామాల రైతులు, ప్రజలు ఆదివారం సాగు, త్రాగునీరు కోసం యుద్ధం తప్పదు అని తాతిరెడ్డిపల్లి బియాండ్ ఎత్తిపోతల పథకం వద్దకు భారీగా తరలివెళ్లారు. ఇది శాంపిల్ మాత్రమే అని 24గంటలలోపు సంబంధింత అధికారులు ఎప్పటినుంచి నీరు విడుదల చేస్తారో తమ నిర్ణయాన్ని తెలపాలని రైతులు కోరుతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కార్యాలయాల్లో తొంగొని ఉండకుండా సాగు, త్రాగునీరు విడుదల చేసేందుకు అధికారులు ఈపాటికే చర్యలు చేపట్టింటే వారికి ప్రజల మన్ననలు లభించేవి పలువురు రైతులు అంటున్నారు.
ఎండలు మండుతున్నాయి:
గత రెండు రోజులుగా ఎండలు మండుతున్నాయి.
తాతిరెడ్డిపల్లె బియాండ్ ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణ చేసేందుకు అధికారులకు తీరిక లేకుండా పనులు ఉన్నాయా అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లేదంటే “సాగు, త్రాగునీటి కోసం అధికారులపై యుద్దమే” అని రైతులు హెచ్చరిస్తున్నారు.




