Uncategorizedఆంధ్ర ప్రదేశ్క్రైమ్తెలంగాణరాజకీయంవిద్యవైరల్

జాతీయలోక్ అదాలత్ లో 40,921 కేసులు పరిష్కారం

కర్నూలు బ్యూరో మన జనప్రగతి మార్చి 14:-రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో 40,921 కేసులు పరిష్కారం అయ్యాయి. 186 మోటార్ ఆక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000/- బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఇప్పించడం జరిగినది. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 190 మంది రైతుల వారసులకు రూ. 83,29,124/- రూపాయలు నష్టపరిహారంగా ఇప్పించారు.జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ,కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ మొత్తం రెండు జిల్లాల్లో 25 బెంచీలను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు,40232 క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి,ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు,ఏడవ అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం,కర్నూలు బార్ ప్రసిడెంట్ హరినాథ్ చౌదరి,రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మినరసింహారెడ్డి,ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ మరియు జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్,జూనియర్ సివిల్ జడ్జి అనూష,కోర్టుమా నిటరింగ్ సిఐ.రామానాయుడు,న్యాయ వాదులు, బ్యాంక్ అధికారులు,బి యస్ యన్ యల్ అధికారులు,పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button