
టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమ కూటమికి ఉందని టీవీకే నాయకత్వం గవర్నర్‌కు వివరించిన నేపథ్యంలో, విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి అలాగే వీలైనంత త్వరగా అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.టీవీకే శ్రేణులు ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తుండగా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




