ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

పులివెందుల పట్టణంలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

 

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో

పులివెందుల పట్టణంలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

పులివెందుల టౌన్ మన జనప్రగతి అక్టోబర్ 19:-
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పులివెందుల పట్టణంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
పులివెందుల మున్సిపల్ కార్యాలయం నుంచి ఫ్లవర్ మార్కెట్ జంక్షన్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. గొడవలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు.
కార్యక్రమంలో పులివెందుల అర్బన్ సి.ఐ పురుషోత్తం రాజు, పులివెందుల రూరల్ సి.ఐ శాంతిలాల్, వేంపల్లి సి.ఐ నరసింహులు మరియు పులివెందుల సబ్ డివిజన్ లోని ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button