Featuredఅంతర్జాతీయంజాతీయంభక్తివైరల్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం టీటీడీ సిఫార్సు లేఖలు స్వీకరించరు

 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం టీటీడీ సిఫార్సు లేఖలు స్వీకరించరు

తిరుమల, అక్టోబరు 20 (మన జనప్రగతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం ఈ నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేసింది. స్వయంగా తిరుమలకు వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పిస్తామని తెలిపింది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button