Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్ర ప్రదేశ్రాజకీయంలైఫ్ స్టైల్విద్య

నల్లపురెడ్డిపల్లి విద్యార్థులకు ఎమ్మెల్సీ సతీమణి భరోసా

పరీక్షా సామగ్రి పంపిణీ టాపర్లకు రూ.10,000 బహుమతి

పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 27:పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సతీమణి శ్రీమతి భూమిరెడ్డి ఉమాదేవి ముందుకొచ్చారు. శుక్రవారం పులివెందుల మండలం,నల్లపురెడ్డిపల్లి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు.పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 105 మంది విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నులను పంపిణీ చేశారు.రాబోయే పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి,ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.

పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా చదివి,మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆమె కోరారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.రేపటి సమాజానికి మీరే దిక్సూచి. పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భూమిరెడ్డి ఉమాదేవి కోరారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు స్థానిక నేతలు పాల్గొని ఉమాదేవి ఉదారతకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button