
వేముల జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ
1569 ఓట్ల మెజారిటీతో నాగేళ్ల సత్యప్రభావతమ్మ విజయం
వేముల, మన జనప్రగతి, నవంబర్ 07:- వేముల మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేళ్ల సత్యప్రభావతమ్మ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల విజయలక్ష్మిపై 1569 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎంతో ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన పోలింగ్ అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యం సాధించారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించి నాగేళ్ల సత్యప్రభావతమ్మకు అభినందనలు తెలిపారు.
మొత్తం ఓట్లు 17,074
వైఎస్సార్‌సీపీ – 9,040
తెలుగుదేశం పార్టీ – 7,471
స్వతంత్ర అభ్యర్థి – 21
స్వతంత్ర అభ్యర్థి – 7
నోటా – 131
చెల్లని ఓట్లు – 389
1,569 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం
జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 1,569 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు
వైఎస్సార్‌సీపీ – 9,040
తెలుగుదేశం పార్టీ – 7,471
స్వతంత్ర అభ్యర్థి – 21
స్వతంత్ర అభ్యర్థి – 7
నోటా – 131
చెల్లని ఓట్లు – 389
1,569 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం
జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 1,569 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు




