Uncategorizedఆంధ్ర ప్రదేశ్క్రీడలుక్రైమ్ట్రావెల్రాజకీయంలైఫ్ స్టైల్విద్యవైరల్

పదో తరగతి విద్యార్థులకు అండగా టీజే ఫౌండేషన్

పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 06:పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు టీజే ఫౌండేషన్ ముందుకు వచ్చింది.పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆన్స్ స్కూల్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూగుట్ల మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు.టీజే ఫౌండేషన్ సౌజన్యంతో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసుకోవడానికి అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు (అట్టలు) మరియు పెన్నులను మధుసూదన్ రెడ్డి స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా,క్రమశిక్షణతో చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, స్కూల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆయన హితవు పలికారు.ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బందితో పాటు తరుణ్, మనోహర్,ప్రకాశం,శ్యామ్, శివరామ్,ఫయాజ్,షైక్ అక్రమ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button